‘బిగ్ బాస్ 6’ లో 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆర్జే సూర్య. స్టేజ్ పై ఊర మాస్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు, హోస్ట్ నాగార్జున ముందు టాప్ హీరోలను మిమిక్రీ చేస్తూ వావ్ అనిపించాడు. ఎక్కువగా విజయ్ దేవరకొండని మిమిక్రీ చేస్తూ ఉంటాడు. అందువల్ల ఇతను బాగా పాపులర్ అయ్యాడు. హౌస్లో ప్రస్తుతం ఇతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. ఇతని గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) ఆర్జే సూర్య పూర్తి పేరు సూర్య నారాయణ. ఇతను ఆర్జే గా కెరీర్ ను మొదలుపెట్టి.. మిమిక్రీ ఆర్టిస్ట్ గా పాపులర్ అయ్యాడు. తర్వాత యాంకర్ గా గా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
2) సూర్య జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరికి చెందిన పశువుల లంక. 1991 వ సంవత్సరం ఏప్రిల్ 1న ఇతను జన్మించాడు.
3)1996 పశువుల లంకలో భయంకరమైన వరదలు రావడంతో సూర్య ఫ్యామిలీ వెస్ట్ గోదావరికి చెందిన మారారు.
4) సూర్య జీవితంలో కూడా ట్రాజెడీ ఉంది. అతని సోదరుడు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు.
5) సూర్య విద్యాభ్యాసం అంతా పశువుల లంక మరియు భీమవరంలోనే జరిగింది.
6) భీమవరంలో ఉన్న సి.ఎస్.ఎన్ కాలేజీలో బి.కామ్ పూర్తిచేశాడు. అటు తర్వాత ఎం.కామ్ కోసం ఓ గవర్నమెంట్ కాలేజీలో చేరాడు. అయితే ఎం.కామ్ చదువుని మధ్యలోనే ఆపేశాడు సూర్య. అందుకు కారణం.. ఇతని లవ్ ఫెయిల్యూర్..!
7) కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉన్న సూర్య.. తన స్నేహితుల ద్వారా రెడ్.ఎఫ్.ఎం గురించి తెలుసుకున్నాడు.అప్పుడు ఆడిషన్స్ జరుగుతుండడంతో.. ఇతను అటెండ్ అవ్వడం, సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా అతను ఆర్జేగా మారాడు.
8) అటు తర్వాత… ఇతను హైదరాబాద్ మారడం జరిగింది. ఇక 2016లో అతనికి ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో అవకాశం దక్కింది.
9) అటు తర్వాత అదే డైరెక్టర్ తెరకెక్కించిన ‘పిఎస్వి గరుడ వేగ’ చిత్రంలో కూడా ఇతను నటించాడు. కానీ ఈ చిత్రాలు అతనికి పెద్దగా గుర్తింపుని ఇవ్వలేదు.
10) సూర్య ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 43 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఈ ‘బిగ్ బాస్ 6’ సూర్యకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.