Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ లో ఎంట్రీ ఇచ్చిన 15 మంది కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ 9’ ప్రారంభం అయ్యింది. ఈసారి స్పెషల్ ఏంటంటే.. ‘అగ్నిపరీక్ష’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. దాని ద్వారా సీజన్ 9 లోకి 5 మంది సామాన్యులకు ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించింది. దాని కోసం నవదీప్, బిందు మాధవి, అభిజీత్ వంటి సీరియల్ బిగ్ బాస్ కంటెస్టెంట్లను జడ్జిలుగా పెట్టాడు. వాళ్ళు 13 మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేశారు. వీళ్ళ నుండి 5 మందిని ఫిల్టర్ చేసి హౌస్లోకి పంపించారు. వీళ్ళతో పాటు హౌస్లో ఎంట్రీ ఇచ్చిన మిగిలిన కంటెస్టెంట్స్ లిస్ట్ ను ఒక లుక్కేద్దాం రండి :

 

Bigg Boss 9


1) తనూజ : మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి తనూజ ఎంట్రీ ఇచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘జరగండి జరగండి’ పాటతో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.కన్నడ నటి అయినప్పటికీ ‘ముద్దమందారం’ సీరియల్ తో ఆమె బాగా ఫేమస్ అయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా ఈమె పని చేసినట్టు, నాగార్జున ముందు నుండే పరిచయం ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే నాగార్జున కోసం స్పెషల్ మటన్ బిర్యానీ కూడా చేసుకొచ్చి కాక పట్టింది.మరోపక్క తనూజ నాన్నగారికి ఆమె బిగ్ బాస్లోకి వెళ్తున్నట్టు తెలీదని చెప్పి షాక్ ఇచ్చింది.  అయితే మంచి పేరుతోనే తిరిగి వస్తానని ఆమె తండ్రికి హామీ ఇచ్చి హౌస్ లోకి వెళ్ళింది.

2)ఫ్లోరా షైనీ : ఈమె అందరికీ ఆశా షైనీగా సుపరిచితం. అయితే మొదటి సినిమాకి ఆమె ప్రమేయం లేకుండా మేకర్స్ ఆశా షైనీ అని వేశారట. అయితే ఈసారి ఫ్లోరా షైనీ గా రీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది. వీర శంకర్ డైరెక్ట్ చేసిన ‘ప్రేమ కోసం’ సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈవీవీ దర్శకత్వంలో రూపొందిన ‘చాలా బాగుంది’ లో వడ్డే నవీన్ సరసన హీరోయిన్ గా చేసింది. తర్వాత ‘నరసింహనాయుడు’  సినిమాలో ‘లక్స్ పాప’ పాటతో ఈమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత దాదాపు 50 సినిమాల్లో నటించింది. మరి బిగ్ బాస్ 9 లో ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

3)కళ్యాణ్ పడాలా : 13 మంది కామన్ మెన్స్ లో ఒకరైన కళ్యాణ్ మూడో కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ ను ఒక యుద్దభూమిలా భావిస్తున్నట్లు తెలిపాడు. కొంచెం హుషారుగానే ఎంట్రీ ఇచ్చాడు. మరి ఎంత వరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.

4) ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్ : ‘జబర్దస్త్’ తో పాపులారిటీ సంపాదించుకున్న ఇమ్మాన్యుయెల్ 4వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడంతోనే చిరంజీవి, విజయ్ దేవరకొండ  వంటి స్టార్స్ వాయిస్..లను మిమిక్రీ చేసి అందరినీ అలరించాడు. మరి హౌస్ లో ఎలా రాణిస్తాడో చూడాలి.

5)శ్రష్టి వర్మ : జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు పెట్టి హైలెట్ అయిన శ్రష్టి వర్మ 5 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. చాలా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పనిచేసిన ఈమె  ‘కింగ్డమ్’ లోని ‘రగిలే రగిలే’ అనే పాటతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘హౌస్ లో కూడా తన ఒరిజినాలిటీ చూపిస్తానని.. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా స్ట్రాంగ్ గా నిలబడతానని చెప్పి’ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి అక్కడ ఎలా ఉంటుందో చూడాలి.

6)మాస్క్ మ్యాన్ హరీష్ : ‘అగ్ని పరీక్ష’ జ్యూరీ మెంబర్ బిందు మాధవి వచ్చి..  6వ కంటెస్టెంట్ గా కామన్ మెన్ అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ ను ఎంపిక చేసింది. తర్వాత అతను హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి ఇతను హౌస్ లో ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.

 

7)భరణి : ‘అమృతం’ ‘చి ల సౌ’ సీరియల్స్ తో పాపులర్ అయిన ఇతను ఆ తర్వాత ‘గోపాల గోపాల’ వంటి పెద్ద సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను 7వ కంటెస్టెంట్ గా స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చాడు. అతను ఒక బాక్స్ తో స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో ఉన్నది స్టేజి పైనే రివీల్ చేయాలి అని హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ తరపున చెప్పడం.. అందుకు భరణి నో చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్ళిపో అంటూ ఓ సీన్ క్రియేట్ చేసి… చివరికి హౌస్లోకి అతన్ని పంపించారు.

8)రీతూ చౌదరి : ఇన్ఫ్లుయెన్సర్ గా కెరీర్ ను ప్రారంభించి తర్వాత ‘జబర్దస్త్’ తో బాగా పాపులర్ అయ్యింది. ఈమె అసలు దివ్య అయినప్పటికీ రీతూ అని పిలిస్తేనే ఇష్టమని చెప్పింది. మరి హౌస్ లో ఈమె ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.

9)డెమోన్ పవన్ : 9వ కంటెస్టెంట్ గా కామన్ మెన్ డెమోన్ పవన్ ఎంట్రీ ఇచ్చాడు.’ఏదైనా ఆలోచించి మాట్లాడతాను.. ఆలోచించి వ్యవహరిస్తాను’ అంటూ హౌస్ లోకి అడుగుపెట్టాడు. మరి ఎంతవరకు రాణిస్తాడో చూడాలి.

10) సంజన గల్రాని : 10 వ కంటెస్టెంట్ గా ఈమె ఎంట్రీ ఇచ్చింది. ఒక యాడ్ లో చూసి దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈమెకు ‘బుజ్జిగాడు’ లో ఛాన్స్ ఇచ్చాడట. ఆ తర్వాత ఈమెకు హీరోయిన్ ఛాన్స్..లు కూడా వచ్చినట్టు తెలిపింది. ఈమె పై ఉన్న కాంట్రోవర్సీ ముద్రని తొలగించుకోవడానికి హౌస్ లోకి వెళ్తున్నట్టు తెలిపి హౌస్లోకి వెళ్ళింది. మరి అక్కడ ఆమె ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి.

11) రాము రాథోడ్ : ‘రాను బొంబాయికి రాను’ అనే పల్లె పాటతో పాపులర్ అయిన రాము రాథోడ్ 11వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. లాక్ డౌన్ లో ప్రైవేట్ సాంగ్స్ చేయాలని ఇన్స్పైర్ అయ్యి అడుగులు వేసినట్లు తెలిపాడు. మరి కంటెస్టెంట్ గా కూడా హౌస్ లో ఆకట్టుకుంటాడేమో చూడాలి.

12) దమ్ము శ్రీజ : ‘అగ్ని పరీక్ష’ జ్యూరీ మెంబర్ నవదీప్ వచ్చి కామన్ మెన్ క్యాటగిరిలో దమ్ము శ్రీజని ఎంపిక చేశాడు. ‘దమ్ముతో విజేతగా నిలుస్తాను’ అంటూ హౌస్లోకి వెళ్ళింది. చూడాలి మరి ఎలా ఆడుతుందో..!

13)సుమన్ శెట్టి : ‘జయం’ తో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టి ఈ సీజన్ లో 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మరి హౌస్ లో ఎలా రాణిస్తాడో చూడాలి.

14)ప్రియా శెట్టి : కామన్ మెన్ కేటగిరిలో ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి.

15)మర్యాద మనీష్ : 15 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రజల మనసులు తన మర్యాదతో గెలుస్తాడో లేదో చూడాలి.

‘మిరాయ్‌’ పుట్టిందిలా.. సాగిందిలా.. కార్తిక్‌ చెప్పిన స్పెషల్స్‌ ఇవే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus