కె.విజయ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ‘నువ్వే కావాలి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో సెకండ్ హీరో ప్రకాష్ పాత్రలో నటించాడు సాయి కిరణ్.ఇతను ప్రముఖ సింగర్.. పి.సుశీల గారి మనవడు అన్న సంగతి చాలా మందికి తెలీదనే చెప్పాలి. ‘నువ్వే కావాలి’ చిత్రం తరువాత ‘ప్రేమించు’ ‘మనసుంటే చాలు’ ‘ఎంత బావుందో’ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు సాయి కిరణ్. ఇంకా ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు…
కానీ అవేమీ హిట్ అవ్వకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి ‘జగపతి’ ‘షిరిడి సాయి’ ‘నక్షత్రం’ ‘గోపి గోడమీద పిల్లి’ వంటి చిత్రాల్లో నటించాడు. అయితే అలా కూడా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ‘కోయిలమ్మ’ వంటి సీరియల్స్ లో కూడా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఉపయోగం లేకుండా పోయింది.ఇదిలా ఉంటే.. సాయి కిరణ్ తన కుటుంబం కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడట. కెరీర్ ప్రారంభంలో సాయి కిరణ్ తో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపాడట.
కానీ కుటుంబ సభ్యులకు ఆ హీరోయిన్ ను.. సాయి కిరణ్ కు ఇచ్చి పెళ్ళి చెయ్యడం ఇష్టం లేదట. వారిని కన్వెన్స్ చేసే ప్రయత్నాలు కొన్ని చేసినా.. వర్కౌట్ కాలేదని. ఇక వారిని నొప్పించడం కూడా ఇష్టం లేక.. తాను ప్రేమించిన ఆ హీరోయిన్ ను దూరం చేసుకున్నాడని తెలుస్తుంది.