Maavichiguru: 26 ఏళ్ళ ‘మావిచిగురు’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

  • May 31, 2022 / 11:57 AM IST

‘గోవిందా గోవిందా’ తో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నిర్మాత అశ్వినీదత్ గారిని ‘శుభలగ్నం’ చిత్రంతో ఆ అప్పుల నుండీ బయటపడేసి లాభాల బాట పట్టించాడు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. స్టార్ ప్రొడ్యూసర్ కే హిట్ ఇచ్చిన దర్శకుడు అని ఇండస్ట్రీలో అంతా ఆయన్ని గుర్తించారు. దాంతో ఆయనకి స్టార్ హీరోల నుండీ పిలుపు వచ్చింది. నాగార్జునతో ‘వజ్రం’, బాలకృష్ణతో ‘టాప్ హీరో’ వంటి చిత్రాలు చేశాడు. కానీ ఇవి రెండు ప్లాప్ అయ్యాయి.

ఆ తర్వాత తీసిన ‘ఘటోత్కచుడు’ ‘గన్ షాట్’ చిత్రాలు కొంత ఓకె అనిపించాయి కానీ హిట్లు కాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని మళ్ళీ జగపతి బాబుతో జట్టు కట్టాడు ఎస్వీ కృష్ణారెడ్డి. అలా చేసిన చిత్రమే ‘మావిచిగురు’. భర్త పై విపరీతమైన ప్రేమతో ఏ ఆడదానితో మాట్లాడినా తన భర్త ఆమె మాయలో పడిపోతాడు అనే భయంతో ఉంటుంది సీత(ఆమని).అయితే మధు(జగపతి బాబు) తన కొలీగ్ సుధ(రంజిత) తో క్లోజ్ గా ఉండడం చూశాక సీత అనుమానం,భయం ఇంకా ఎక్కువ అవుతాయి.

వీళ్ళకి ఎటువంటి ఉద్దేశాలు లేకపోయినా మధు, సుధ పెళ్లి చేసుకునే వరకు వెళ్లేలా చేస్తుంది సీత.అయితే అదంతా మధు, సుధలను కలపడానికే అని చివర్లో తెలుస్తుంది. దీనికి కారణం సీత ప్రాణాలు కోల్పోయే వ్యాధితో బాధ పడుతుండడం వలన అని ఆమె చనిపోయాక హీరోకి తెలుస్తుంది. 1996 మే 30న విడుదలైన ‘మావిచిగురు’ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ మూవీ విపరీతంగా అలరించింది. క్లైమాక్స్ లో ట్రాజెడీ ఎండింగ్ ఉన్నా స్టార్టింగ్ నుండీ ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే కామెడీ ఇందులో ఉంటుంది.కృష్ణారెడ్డి గారిని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించిన ఈ మూవీ విడుదలై నేటితో 26 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus