Manish Wadhwa: శ్యామ్ సింగరాయ్ విలన్ ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్!

సాయి పల్లవి నాచురల్ స్టార్ నాని కలయికలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రాహుల్ సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఓ వర్గం వారి ఫోకస్ ఎక్కువగా మహంత్ అనే పాత్రలో కనిపించిన విలన్ పై పడింది. అతని గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి.

ఒక విధంగా అతను కొత్త నటుడు అని అని అందరూ అనుకున్నారు. కానీ ఇది వరకే అతను బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపును అందుకున్నారు. ముంబైకు చెందిన ఈ నటుడు పేరు మనీష్ వాధ్వా. మొదట అతను నార్త్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాడు. అనంతరం టెలివిజన్ సీరియల్స్ ద్వారా నటుడిగా సరికొత్త కెరీర్ ను స్టార్ట్ చేశాడు. చాణక్యుడు పాత్రలతోనే మనీష్ ఎక్కువగాఅయ్యాడు. అలాంటి ఫేమస్ పాత్రల్లో మరొకరిని ఊహించుకోలేము అనేలాగా మనీష్ తన నటనతో ఎంతగానో మెప్పించారు.

అలాగే చంద్రగుప్తమౌర్య, పద్మవాతార్, శ్రీకృష్ణ వంటి ప్రముఖ హిందీ సీరియల్స్ లలో కూడా నటించారు. అంతే కాకుండా బాలీవుడ్ లో మణికర్ణిక, పద్మవత్ వంటి బిగ్ బడ్జెట్ సినిమాలలో కూడా ప్రత్యేకమైన పాత్రలలో నటించాడు. దర్శకుడు రాహుల్.. పద్మావత్ సినిమా చూసిన తర్వాత శ్యామ్‌‌ సింగరాయ్ లో మహాంత్ అనే పాత్రకు మనీష్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఇదే అతని మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.

అలాగే టాలీవుడ్ లో మరొక ఆఫర్ కూడా వచ్చినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన మనీష్ తెలుగు చిత్ర పరిశ్రమలో నటించాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి శ్యామ్ సింగరాయ్ సినిమాతో తన కోరిక నెరవేరినట్లు కూడా ఈ నటుడు వివరణ ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో మనీష్ ఇంకా ఎలాంటి పాత్రలు అందుకుంటాడో చూడాలి.

1

2

3

4

5

6

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus