ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మంగళవారం కన్నుమూశారు. తెలుగు సినీ సాహిత్యానికి పెద్ద దిక్కుగా వుంటూ.. తన పాటలతో కోట్లాది మందిని అలరించిన సిరివెన్నెల మరణం నిజంగా టాలీవుడ్‌కు, సాహిత్య ప్రియులకు పెద్ద షాకే. అయితే నెటిజన్లు సిరివెన్నెలకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్‌ను జల్లెడ పడుతున్నారు. ఆయన సొంతవూరు, తల్లిదండ్రులు, విద్యాభ్యాసం, సాహిత్య ప్రపంచంలోకి ఎంట్రీ వంటి వివరాల కోసం శోధిస్తున్నారు.
అయితే టాలీవుడ్‌తో దశాబ్ధాల సిరివెన్నెల ప్రయాణంలో ఆయన కుటుంబసభ్యుల వివరాలు అంతగా బయటకు రానివ్వలేదు. మరి సిరివెన్నెల వారసులు ఎవరు అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. సిరివెన్నెల ఇద్దరు కుమారులు అల్రెడీ పరిశ్రమలోనే వున్నారు. ఒక కొడుకు పేరు యోగేశ్వర్ శర్మ కాగా రెండో అబ్బాయి పేరు రాజా. యోగేశ్వర్ సంగీత దర్శకుడు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుదిరితే కప్పు కాఫీతో పాటు, రంగు, అలాగే ఇంకా కొన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు.
రాజా విషయానికి వస్తే.. ఈయన నటుడిగా రాణిస్తున్నారు. 2008 లో వచ్చిన కేక సినిమాతో రాజా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనంతరం ఎవడు సినిమాలో రామ్ చరణ్‌కి ఫ్రెండ్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని పోషించారు . అలాగే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అజ్ఞాతవాసి, రణరంగం, భానుమతి అండ్ రామకృష్ణ, అంతరిక్షం, మిస్టర్ మజ్నుతో పాటు ఎన్నో సినిమాల్లో నటించారు రాజా. ఫిదాలో వరుణ్ తేజ్‌కి అన్నగా నటించింది రాజాయే. సో.. సిరివెన్నెల వారసత్వం ఆయన ఇద్దరు కొడుకుల ద్వారా టాలీవుడ్‌లో కొనసాగుతుందన్న మాట.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?