Yashmi Gowda: ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ యష్మీ గౌడ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు

‘బిగ్ బాస్ 8’ ఘనంగా ప్రారంభమైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి ‘బిగ్ బాస్’ కోరిక మేరకు, నాగార్జున (Nagarjuna) సూచన మేరకు.. ఇద్దరు ఇద్దరుగా అంటే బడ్డీ మేట్స్ గా కంటెస్టెంట్లు హౌస్లోకి వెళ్లడం జరిగింది. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ 8 లోకి మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది యష్మీ గౌడ (Yashmi Gowda) . బుల్లితెర ప్రేక్షకులకి ఈమె సుపరిచితమే. మిగిలిన వారికి ఈమె తెలియకపోయుండొచ్చు. అందుకే అనుకుంట ఈమె గురించి గూగుల్ లో కొంచెం ఎక్కువగానే సెర్చింగ్..లు జరుగుతున్నాయి.

Yashmi Gowda

ఇక యష్మీ గౌడ (Yashmi Gowda) విషయానికి వస్తే.. ఈమె బెంగళూరులో పుట్టి పెరిగింది.1995 ఆగస్టు 30న ఈమె జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 28 ఏళ్ళు అని తెలుస్తుంది. 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు కలిగిన ఈమెకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. దాని వల్లే ఈమెకు నటనపై ఆసక్తి కలిగిందట. చదువుకునే రోజుల్లోనే ‘యష్మీ గౌడ’ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా అటెంప్ట్ చేసిన ‘విద్యా వినాయక’ అనే సీరియల్‌ ఆడిషన్లో సక్సెస్ అయ్యిందట. వెంటనే ఆ సీరియల్ కి ఈమె ఎంపిక అవ్వడం జరిగింది. 2017 లో ప్రారంభమైన ఈ సీరియల్‌లో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. తర్వాత ‘నాగ భైరవి’, ‘స్వాతి చినుకులు’, ‘త్రినయని’, ‘కృష్ణ ముకుంద మురారి’ వంటి సీరియల్స్‌లో నటించి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సీరియల్‌లో ‘ముకుంద’ అనే నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించి మెప్పించింది.

అటు తర్వాత సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ సీజన్ 3 లో పవన్ రాజ్‌పుత్‌తో కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకు లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. మరి ‘బిగ్ బాస్ 8’ లో ఈమె ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.

చుట్టమల్లే సాంగ్ ఖాతాలో సంచలన రికార్డ్స్.. అనిరుధ్ మ్యాజిక్ పని చేసిందిగా!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus