Dimple Hayathi: అక్రమంగా హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లోకి చొరబడ్డ జంట..!

డింపుల్ హయాతి నాలుగైదు రోజులుగా ఈ పేరు తెగ ట్రెండ్ అవుతుంది. కారణం చాలా మందికి తెలిసే ఉంటుంది. జూబ్లీహిల్స్ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆమె… అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్, అలాగే అతని డ్రైవర్ తో గొడవ పెట్టుకుంది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.అపార్ట్మెంట్లో రాహుల్ పార్క్ చేసిన కారును ..

డింపుల్ ఫ్రెండ్ డేవిడ్ ఢీ కొట్టడం, తర్వాత ఆమె రాహుల్ కారుని తన్నడంతో ఇరువురి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో రాహుల్ డ్రైవర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో డింపుల్, డేవిడ్ ల పై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు సంగతి అలా ఉంచితే.. తాజాగా డింపుల్ హయాతి ఇంట్లో ఓ యువతీ, యువకుడు అక్రమంగా చొరబడ్డారు. వారు లోపలకు వచ్చి అటు ఇటు చూస్తూ.. ఏదో వెతుక్కుంటున్నట్టు.. అనుమానాస్పదంగా వ్యవహరించారు.

ఇది గమనించిన (Dimple Hayathi) డింపుల్ పనిమనిషి.. వారిని ఆరాతీసే ప్రయత్నం చేసింది. వాళ్ళు సమాధానం చెప్పకుండా అటు ఇటు చూస్తుండగా.. డింపుల్ ఇంట్లో ఉన్న కుక్క వారి మీదకు దూసుకు వచ్చింది. ఈ క్రమంలో వారు భయపడి పారిపోయే ప్రయత్నం చేశారు. మరోపక్క పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. వారు ‘డింపుల్ అభిమానులమని’ చెప్పారట. అయినా పోలీసులు వీరి బ్యాక్ గ్రౌండ్ మొత్తం వెరిఫై చేసిన తర్వాత వదిలెడితే బెటర్ అని భావిస్తున్నట్టు సమాచారం.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus