అన్ ప్రొఫిషినల్ గ్యాంగ్ తో తరుణ్ భాస్కర్
- March 31, 2017 / 12:43 PM ISTByFilmy Focus
అన్ ప్రొఫిషినల్ గ్యాంగ్.. పెళ్లిచూపులు సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. ఈ పేరుతో కొత్త ఇంటర్వ్యూ బేస్డ్ షో రూపుదిద్దుకుంటోంది. స్పూఫ్ వీడియోలతో యూట్యూబ్ లో దూసుకుపోతోన్న నావిక ఫ్యాక్టరీ వారు ఈ షో చేస్తున్నారు. తొలి ఎపిసోడ్ కి పెళ్లిచూపులు చిత్రాన్ని డైరక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ ని ఆహ్వానించి అతనితో సరదగా ముచ్చటించారు. న్యూస్, ఎంటర్టైన్ ఛానల్లో నిర్వహించే ఇంటర్వ్యూ మాదిరిగా కాకుండా, నలుగురు స్నేహితులు చాయ్ సెంటర్ లో కూర్చొని మాట్లాడుకున్నట్లు ఎంతో సహజంగా ఉంది.
ఇందులో తరుణ్ భాస్కర్ తాను షార్ట్ ఫిల్మ్స్ తీసే సమయంలో పడిన కష్టాలు, పెళ్లి చూపులు థియేటర్ లోకి రావడానికి పడిన ఇబ్బందులు.. “నా చావు నేను చస్తా అనే బుక్ రాస్తున్నాను” అనే సీన్ వెనుక కారణం.. ఇలా ఎన్నో రీల్, రియల్ లైఫ్ సంగతులను డైరక్టర్ వివరించారు. 25 నిముషాల నిడివి గల ఈ వీడియో అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ ఇస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












