విడాకులు విషయంపై నోరువిప్పిన రామ్ చరణ్ భార్య
- November 28, 2016 / 09:34 AM ISTByFilmy Focus
ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలిగా ఉపాసన ప్రపంచానికి పరిచయం. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోగానే మరింతగా ఫోకస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట కోడలుగా అడుగుపెట్టి తెలుగు సినీ అభిమానులకు చేరువయ్యారు. అదే సమయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. వాటన్నింటికీ తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. మీరు చెర్రీకి ఫర్ఫెక్ట్ జోడి కాదని వచ్చిన విమర్శపై ఏమంటారు.. అని ఉపాసనను అడగగా ఆమె స్పందిస్తూ.. “నేను రామ్ చరణ్ కి సూట్ కాను అనే విమర్శ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.ఎందుకంటే మా వారికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం ఆనందమే” అని చెప్పారు.
ఇక బుల్లి రామ్ చరణ్ ని ఎప్పుడు చూస్తాం ? అనే ప్రశ్నకు బదులిస్తూ .. “నేను ఎంతోకష్టపడి ఇప్పుడే బరువు తగ్గాను. మళ్లీ బరువు పెరగడం ఇష్టం లేదు. అంతే కాదు నేను, చరణ్ ఒక ప్లాన్ ప్రకారం వెళుతున్నాం. ఇంకా మేము యవ్వనంలో ఉన్నాం. ఈ లైఫ్ ని కొంతకాలం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం.”అని వివరించారు. “రామ్ చరణ్, ఉపాసన విడాకులు తీసుకున్నారు” అనే రూమర్లను కొట్టిపడేశారు. ఇప్పటికీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటామని తెలిపారు. చెర్రీతో పాటు మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటారని ఉపాసన వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












