Ram Charan: చిరు ఇంటికి ట్విన్స్ రాక.. డేట్ ఫిక్స్ అయ్యిందా?
- January 28, 2026 / 06:09 PM ISTByPhani Kumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన..ల వివాహం 2012 లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే పిల్లల కోసం వీళ్ళు టైం తీసుకున్నారు. అదే టైంలో ఎన్ని విమర్శలు వచ్చినా.. తట్టుకున్నారు…వాటిని తిప్పికొట్టారు. అయితే 2023 లో ఓ పాపకు జన్మనిచ్చారు. ఆమెకు క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. పాప ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. మరోవైపు చరణ్ కి బాబు పుట్టాలని కోరుకుంటున్నట్టు చిరు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అది అతి త్వరలో నెరవేరబోతున్నట్టు తెలుస్తుంది.
Ram Charan
వివరాల్లోకి వెళితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే. ఆమెకు నెలలు నిండాయి.కొద్దిరోజుల క్రితం సీమంతం వేడుక కూడా ఘనంగా జరిగింది.దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆమెకు ట్విన్స్ పుట్టబోతున్నారు అని వైద్యులు తెలిపినట్టు కూడా టాక్ రన్ అయ్యింది. సాధారణంగా స్కానింగ్ లో కనుక కవలలు అని తేలితే.. వైద్యులు ముందుగానే కాబోయే తల్లిదండ్రులతో చెబుతారు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తారు.

అందుకే ఆ విషయం బయటకు వచ్చింది అని అంతా భావిస్తున్నారు. మరోపక్క చరణ్ కు కవలలు పుట్టబోతున్నట్టు చిరంజీవి… ఇండస్ట్రీ జనాలతో షేర్ చేసుకున్నట్టు కూడా టాక్ నడిచింది. అయితే డెలివరీ డేట్ ఎప్పుడు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. జనవరి 31న ఉపాసనకి డెలివరీ అని తెలుస్తుంది.సో అదే రోజున కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు అర్ధం చేసుకోవచ్చు. సో మెగా ఫ్యామిలీలోకి కవలలు ఎంట్రీ ఇచ్చే రోజు కూడా దగ్గరపడిందన్న మాట.
















