Upasana: ఉపాసన డెలివరీ ప్లేస్ ఫిక్స్ అయ్యిందట..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలో తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. అతని భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి. మెగా ఫ్యామిలీలోకి ఓ కొత్త మెంబర్ రాబోతున్నట్టు… చాలా రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ అనౌన్స్ చేసింది. ఉపాసన బేబీ బంప్ ఫోటోలు కూడా మొన్నామధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాంచరణ్ అమెరికాలో ఉన్నారు. క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవానికి.. అలాగే ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు …రాంచరణ్ అక్కడికి వెళ్లడం జరిగింది.

అలాగే యూఎస్ లో పాపులర్ టాక్ షో అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ లో కూడా చరణ్ పాల్గొన్నాడు. ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ కూడా ఈ షోలో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో ఉపాసన ప్రెగ్నెన్సీ మేటర్ పై కూడా డిస్కషన్ జరిగింది. ‘మీ ఫస్ట్ బేబీకి డెలివరీ చేయడాన్ని గౌరవంగా భావిస్తాను’ అంటూ జెన్నీ.. చరణ్ తో అనడం జరిగింది. ఇక జెన్నీ వ్యాఖ్యల పై తాజాగా ఉపాసన స్పందించింది.

‘డాక్టర్ జెన్నిఫర్ మీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మిమ్మల్ని చూడాలని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. మా బేబీకి డెలివరీ చేసేందుకు అపోలో హాస్పిటల్స్ లోని డాక్టర్ సుమన, డాక్టర్ రూమ సిన్హాలతో మీరు కలవాలని కోరుకుంటున్నాను.’ అంటూ ఉపాసన కోరింది. ఇందుకు జెన్నీ …’నాకు కూడా రావాలనే ఉంది’ అంటూ సమాధానం ఇచ్చింది. మొన్నటి వరకు ఉపాసన అమెరికాలో డెలివరీ చేయించుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది.

కానీ ఆమె లేటెస్ట్ కామెంట్స్ తో ఆమె డెలివరీ అపోలో హాస్పిటల్స్ లోనే ఉంటుందని స్పష్టమవుతుంది. అపోలో హాస్పిటల్స్ కు ఉపాసన వైస్ చైర్ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. సో ఆమె సుఖ ప్రసవానికి అదే మంచి ప్లేస్ అని ఉపాసన భావిస్తుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దానికే ఫిక్స్ అయినట్లు క్లియర్…గా తెలుస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus