నా పిల్లలకు అదే అనుభవాన్ని పంచుతా… ఎమోషనల్ పోస్ట్ చేసిన ఉపాసన!

ఉపాసన కామినేని కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కామినేని ఫ్యామిలీలో జన్మించిన ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో గుర్తింపు సంపాదిచుకున్నారు. ఇక ఈమె రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. ఇలా మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టిన ఈమె రెండు కుటుంబాల గౌరవ ప్రతిష్టలను కాపాడుతూ వచ్చారు. ఇలా మహిళా వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ మంచి మనసును చాటుకున్నారు.

ఇక ఈమెకు ఏమాత్రం విరామ సమయం దొరికిన పూర్తిగా తన కుటుంబంతో కలిసి గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా తన నానమ్మ తాతయ్యలతో ఉపాసనకు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ మధ్యకాలంలోనే తన తాతయ్య మరణించారు. ఇక ప్రస్తుతం ఉపాసన నానమ్మ కూడా మరణించడంతో తన ఇంట విషాదం నెలకొంది.ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన నాన్నమ్మతో కలిసిన దిగిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన నాన్నమ్మ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

తన నానమ్మ తన చివరి క్షణాల వరకు కృతజ్ఞత, సానుభూతి, నిజాయితీతో , ప్రేమగా జీవించారు తన చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు. తన నాన్నమ్మని ఎప్పటికీ తను గుర్తుపెట్టుకుంటానని తన పిల్లలకు కూడా తన నాన్నమ్మ తనకు నేర్పిన, చెప్పిన అనుభవాలను తెలియజేస్తూ వారిని పెంచుతాను అంటూ ప్రామిస్ చేస్తూ తన నాన్నమ్మతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు తన నాన్నమ్మ ఆత్మకు శాంతి కలగాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus