Upasana: పిల్లలను కనడాన్ని బిజినెస్ కోణంలో ఆలోచించిన మెగా కోడలు!

మెగా అభిమానులు గత పది సంవత్సరాల నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక నెరవేరింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావాలని మెగా అభిమానులు ఎంతో ఆరాటపడ్డారు అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తూ గుడ్ న్యూస్ చెప్పడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇకపోతే పిల్లల గురించి గతంలో ఉపాసన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాసన పిల్లలను కనడం గురించి మాట్లాడుతూ…

పిల్లలను కనడం అనేది 20 సంవత్సరాల ప్రాజెక్టు. మనం తల్లిదండ్రులు కావడానికి మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణిని తీసుకురావడం అనేది అతిపెద్ద బాధ్యత. వారు పుట్టిన తర్వాత వారికి ఏం కావాలి ఏం చేయాలి అనే విషయాల గురించి పూర్తిగా అవగాహన ఉండాలని తెలిపారు. ఇలా అన్ని విషయాల గురించి మనకు అవగాహన ఉన్నప్పుడే తల్లిదండ్రులు కావాలని తెలిపారు.

ఇలా పిల్లలకు ఏం కావాలనే విషయాల గురించి పూర్తిగా సిద్ధమయ్యే అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని తెలిపారు. ఇలా పిల్లలను కనే విషయంలో కూడా ఉపాసన ఒక బిజినెస్ ఉమెన్ గా ఎంతో ప్రాక్టికల్ గా ఆలోచించారని చెప్పాలి. ఇలా గతంలో పిల్లల గురించి ఉపవాసం చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus