Upasana: ప్రెగ్నెన్సీ డైట్ బయటపెట్టిన ఉపాసన.. ఆహారం తినలేదంటూ కామెంట్స్!

మెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. మరొకద్ది రోజులలో ఈమె తల్లి కానున్న నేపథ్యంలో దేశ విదేశాలలో పర్యటనలు చేస్తూ తనకు ఇష్టమైన విధంగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక తన భర్త రామ్ చరణ్ సైతం తన భార్య ఇష్టా ఇష్టాలను తన కోరికలను తీరుస్తూ వస్తున్నారు. దుబాయ్ మాల్దీవ్ ట్రిప్ నుంచి హైదరాబాద్ చేరుకున్నటువంటి ఈ జంట తాజాగా ఒక ఈవెంట్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాసన (Upasana) తన భర్త రామ్ చరణ్ గురించి అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో తాను తీసుకుంటున్నటువంటి డైట్ గురించి పలు విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు మొదటి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటికీ తనకు గుర్తుందని తెలియజేశారు.రామ్ చరణ్ వాలెంటైన్స్ డే సందర్భంగా తనకు లవ్ సింబల్ తో ఉన్న ఇయర్ రింగ్స్ కానుకగా ఇచ్చారని ఉపాసన తెలియజేశారు.

ఇలా తనకు రామ్ చరణ్ గిఫ్ట్ ఇచ్చినందుకు ప్రత్యేకగా తాను బోలెడంత ప్రేమ అందించానని ఉపాసన తెలియజేశారు.ఇక తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ కడుపులో బిడ్డను మోస్తూ ఇలా విదేశీ పర్యటనలకు వెళ్లడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు.ఇక తన డైట్ గురించి మాట్లాడుతూ అందరిలాగా తాను అధికంగా ఆహారం తీసుకొని శరీర బరువు పెరగలేదని శరీర బరువు పెరగకుండా తాను కఠిన నియమాలు పాటిస్తున్నానని ఉపాసన తెలియజేశారు.

ఇక తనకోసం కడుపులో బిడ్డ కోసం ఆహారం తీసుకోలేదని ఈమె తెలియజేశారు. ఇలా బిడ్డ కోసం కూడా ఆహారం తీసుకోవడం మంచి పద్ధతి కాదని తెలిపారు. అలాగని ఆహారం తీసుకోకుండా ఉండలేదని ఆహారం తీసుకున్న చాలా శక్తిని ఇచ్చే పౌష్టికాహారాన్ని తాను తీసుకుంటున్నానని ఈ సందర్భంగా ఉపాసన తన ప్రెగ్నెన్సీ డైట్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus