Upasana, Lavanya: తోడి కోడలి వేడుక కోసం ఎదురుచూస్తున్నా.. ఉపాసన కామెంట్స్ వైరల్!

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ గురించి చర్చ జరుగుతుందనే సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరగడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో వరుణ్ లావణ్యల వివాహం గ్రాండ్ గా జరగనుందని బోగట్టా. గతంలో వరుణ్ లావణ్య డేటింగ్ గురించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ఈ వార్తల గురించి స్పందించడానికి వరుణ్ లావణ్య ఇష్టపడలేదు.

అకస్మాత్తుగా వరుణ్ లావణ్య నిశ్చితార్థం జరుపుకుని అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. నిశ్చితార్థ వేడుకలో లావణ్య త్రిపాఠి ధరించిన చీర ఖరీదు ఏకంగా 75,000 రూపాయలు అని సమాచారం అందుతోంది. లావణ్య డెహ్రాడూన్ లో పుట్టి పెరగగా ఆమె తండ్రి లాయర్ అని సమాచారం. లావణ్య అక్క కమిషనర్ అని సమాచారం. లావణ్యకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

మోడలింగ్ పై ఆసక్తితో టీవీ షోల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన లావణ్య అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వగా ఈ బ్యూటీ వివాదాలకు దూరంగా ఉన్నారు. మెగా కోడలు ఉపాసన తోడి కోడలు లావణ్య త్రిపాఠి గురించి పోస్ట్ చేస్తూ “వెల్ కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ మై డియరెస్ట్ లావణ్య.. రాబోయే నా తోడి కోడలి వేడుక కోసం ఎదురుచూస్తున్నాను.. వరుణ్ నీతో చాలా సంతోషంగా ఉంటాడు” అని పేర్కొన్నారు.

ఉపాసన (Upasana) చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్ కు 25,000కు పైగా లైక్స్ వచ్చాయి. ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఉపాసన వచ్చిన తర్వాతే చరణ్ కు కెరీర్ పరంగా మరింత కలిసొచ్చిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. చరణ్, ఉపాసన కలకాలం సంతోషంగా, అన్యోన్యంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus