Upasana: ఆ ఫోటోల గురించి ఉపాసన కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

మెగా కోడలు ఉపాసనకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే. ఉపాసన ప్రస్తుతం గర్భవతి కూడా కావడంతో ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అవుతోంది. త్వరలో పండంటి చిన్నారికి ఉపాసన జన్మనివ్వనున్న నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో ఆమె మరింత కేర్ తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఉపాసన గర్భవతి అయిన తర్వాత మూడో నెల రోజులను గుర్తు చేసుకుంటూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

అప్పుడు తీయించుకున్న ఫోటోలను షేర్ చేసిన ఉపాసన తనకు ఆశ్చర్యంగా ఉందని నా గ్యాలరీలో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇప్పటివరకు షేర్ చేయలేదా అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా మహేష్ భార్య నమ్రత ఈ పోస్ట్ గురించి స్పందించారు. హార్ట్ సింబల్స్ తో నమ్రత కామెంట్ పెట్టగా ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కామెంట్ కు ఉపాసన కూడా రిప్లై ఇచ్చారు.

రామ్ చరణ్ ప్రస్తుతం షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఒకవైపు సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న రామ్ చరణ్ మరోవైపు పలు యాడ్స్ లో మెరుస్తూ మెప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉపాసన అభిమానులతో సైతం టచ్ లో ఉంటున్నారు. ఉపాసన షేర్ చేసిన పోస్ట్ కు లక్షా 58 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఉపాసనకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఉపాసన (Upasana) బిజినెస్ ఉమెన్ గా అంతకంతకూ ఎదుగుతున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వ్యాపార వ్యవహారాలతో బిజీ అవుతానని ఉపాసన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఉపాసనను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus