Upasana, Allu Arjun: చరణ్ బన్నీ మధ్య విబేధాలు లేనట్లే.. ఇదే ప్రూఫ్ అంటూ?

Ad not loaded.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాకు నేషనల్ అవార్డ్ ను సొంతం చేసుకోవడం అటు అల్లు ఫ్యాన్స్ తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. చరణ్, బన్నీ మధ్య విబేధాలు ఉన్నట్టు కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా చరణ్, బన్నీ సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఎవడు సినిమాలో చరణ్, బన్నీ కలిసి నటించారని భవిష్యత్తులో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించే ఛాన్స్ అయితే ఉందని బన్నీ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.

బన్నీకి నేషనల్ అవార్డ్ వచ్చిన నేపథ్యంలో ఉపాసన (Upasana) దంపతులు బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఉపాసన దంపతులు బన్నీకి పూల బొకే పంపడంతో పాటు “డియర్ బన్నీ.. కంగ్రాట్స్.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. ఇలాంటివి ఇంకా నిన్ను ఎన్నో వరిస్తాయి.. అందుకు నువ్వు అర్హుడివి కూడా” అని ఉపాసన స్పెషల్ నోట్ లో పేర్కొన్నారు.

ఈ స్పెషల్ నోట్ ను చదివిన బన్నీ ఎమోషనల్ కావడంతో పాటు “థాంక్యూ సో మచ్.. మనస్సును టచ్ చేశారు” అంటూ సమాధానమిచ్చారు. బన్నీ, ఉపాసన దంపతులు ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదే సమయంలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పకనే చెప్పేశారు. త్వరలో చరణ్, బన్నీ ఒకే వేదికపై కలిసి కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న బన్నీకి కేంద్రం గుర్తింపు ప్రశంసా పత్రాలను అందించడంతో పాటు 50,000 రూపాయల నగదు, రజత కమలాన్ని అందిస్తుంది. నేషనల్ అవార్డ్ రావడంతో బన్నీపై ఒత్తిడి కూడా ఒకింత పెరగనుంది. భవిష్యత్తు సినిమాలతో బన్నీ ఆస్కార్ అందుకునే స్థాయికి ఎదగాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ బన్నీ టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus