Upasana: నవ్వుతున్నట్టే… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మెగా వారి ఇంటి కోడలు..!

రాంచరణ్ సతీమణి, మెగాస్టార్ ఇంటి కోడలు అయిన ఉపాసన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. రాంచరణ్ కు సంబంధించిన అన్ సీన్ పిక్స్ ను షేర్ చేస్తూనే, అతని ఫిట్ నెస్ సీక్రెట్స్, ఫుడ్ స్టైల్ వంటి విషయాల పై కూడా పోస్ట్ లు పెడుతుంటుంది. అంతేకాకుండా సామాజిక అంశాల పైన అలాగే హెల్త్ టిప్స్ వంటివి కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.అయితే రెండు, మూడు రోజులుగా ఈమె పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓ గోపురం ఫోటోని షేర్ చేసి దాని పై కామెంట్ చేసినందుకు వివాదాల్లో కూడా చిక్కుకుంది ఉపాసన.మొన్నామధ్య దుబాయ్ ఎక్స్‌పోలో భాగంగా నరేంద్ర మోడీతో తీసుకున్న ఫోటోలను షేర్ చేసిన ఉపాసన .. డ్రెస్సింగ్ విషయంలో ట్రోలింగ్ కు గురైన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఉపాసన చేసిన గోపురం ఫోటో పోస్ట్ పై ఇప్పటికీ ఆమె ట్రోలింగ్ ను ఎదుర్కొంటూనే ఉంది. అందులో చరణ్, ఉప్సి కూడా ఉన్నారని…

ఆ ఆర్ట్ వేసిన వాళ్ళని అభినందించాలని ఉంది అంటూ ఆమె పెట్టిన పోస్ట్ కు.. ‘దేవుడి ఫొటోల్ని అడ్డం పెట్టుకుని మరీ పబ్లిసిటీ చేసుకోవాలా మీరు?’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఈ విమర్శల పై పరోక్షంగా స్పందించింది ఉపాసన. ‘స్వేచ్చ, స్వాతంత్య్రం అనేది మనలోనే పుడతాయి. స్వేచ్చగా.. భయం లేకుండా బ్రతకాలి. ఎప్పటి కప్పుడు వికసిస్తూనే మెలగాలి’ అంటూ నవ్వుతున్న ఈమోజీలని పెట్టి ఉపాసన ఈ పోస్ట్ ను పెట్టింది. దీనితో ట్రోలర్లకి ఆమె గట్టి సమాధానం చెప్పినట్టే..!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus