Upasana: అలాంటి పిల్లలందరికీ ఉచితంగా వైద్యం… గొప్ప నిర్ణయం తీసుకున్న ఉపాసన!

ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా పేరెంట్ క్లబ్లో చేరిపోయారు. ఇలా తల్లిదండ్రులకు ప్రమోట్ అయిన తర్వాత ఉపాసన అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.ఉపాసన ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత పిల్లల విషయంలో తల్లి పడే బాధ ఏంటో గుర్తించారు దీంతో ఈమె పిల్లల విషయంలో ఓ గొప్ప నిర్ణయం తీసుకొని మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మీడియాతో మాట్లాడుతూ చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేందుకు అపోలో ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న అపోలో చిల్డ్రన్ బ్రాండ్ ను ఉపాసన ప్రారంభించారు.అనంతరం ఈమె మాట్లాడుతూ నేను తల్లి అయినందుకు నా పట్ల ప్రతి ఒక్కరూ చూపించినటువంటి ప్రేమ అభిమానాలకు ధన్యవాదాలు అని తెలియజేశారు ఇక తన కూతురి విషయంలో రామ్ చరణ్ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారని ఈమె తెలిపారు.

ఈ క్రమంలోనే సింగిల్ మదర్స్ వారి పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అప్పుడే నాకు అర్థమైంది అని తెలిపారు అందుకే ఎవరైతే ఒంటరి మహిళలు వారి పిల్లల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ప్రతి ఆదివారం అపోలో హాస్పిటల్లో ఆ పిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నామని వారికి ఉచితంగా వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు.

ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి అపోలో హాస్పిటల్ ద్వారా ఉచితంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నటువంటి ఉపాసన మరోసారి ఒంటరి మహిళలు పిల్లల ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే వారందరికీ ఉచితంగా వైద్యం ఇప్పించే బాధ్యత మాదే అంటూ ఈమె తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో గొప్పది అంటూ పలువురు ఈమెపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus