Upasana: రామ్ చరణ్ ఎంట్రీ సీన్.. పేపర్లు విసురుతూ హంగామా చేసిన ఉపాసన!

దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఓ రేంజ్ లో ఉంది. సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూడడానికి థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో రాజమౌళి టీమ్ అంతా కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళి మేకింగ్, హీరోల పెర్ఫార్మన్స్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. చాలా కాలం తరువాత థియేటర్లో తమ అభిమాన హీరోలను చూసుకొని మురిసిపోతున్నారు.

Click Here To Watch NOW

రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా అతడికి అభిమానిగా మారిపోయి థియేటర్లో రచ్చ చేసింది. హైదరాబాద్ లో భ్ర‌మ‌రాంభ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడడానికి రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. త‌న భార్య ఉపాస‌న‌తో పాటు సినిమా థియేటర్ కి చేరుకున్న రామ్ చరణ్.. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశారు. అయితే సినిమా చూస్తుండగా.. థియేటర్ లోని ఆడియన్స్ కేకలు పెడుతూ హంగామా చేశారు.

పెద్ద ఎత్తున పేపర్లు చించి విసిరారు. ప్రేక్షకులతో పాటు ఉపాసన కూడా సినిమా బాగా ఎంజాయ్ చేసింది. థియేటర్‌లో కింద ప‌డిన కాగిత‌పు ముక్కుల‌ను తీసుకుని పైకి విసిరేస్తూ ఆమె కూడా రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన భర్త సినిమాను థియేటర్లో చూస్తూ ఎంజాయ్ చేసిన ఉపాసనను చూసి మెగాఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించగా, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించారు. అలానే అజయ్ దేవగన్, శ్రియాశరన్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus