Upasana: పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ట్వీట్.. ఏం చెప్పారంటే?

రామ్ చరణ్ భార్య ఉపాసన వ్యాపారవేత్తగా , మంచి గుణం ఉన్న మహిళగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె సేవా కార్యక్రమాలకు సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఉపాసన తరచూ సోషల్ మీడియాలో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఉపాసన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందనే సామెత నిజమేనని చరణ్ విజయం వెనుక ఉపాసన ఉన్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ బృందంతో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన షేర్ చేయడంతో పాటు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆర్.ఆర్.ఆర్ బృందంలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని ఉపాసన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ సాధించిన విజయం దేశం గర్వించే విజయం అని ఉపాసన పేర్కొన్నారు.

రాజమౌళి, చరణ్ ఈ ప్రయాణంలో నన్ను భాగం చేశారని వాళ్లకు కృతజ్ఞతలు అని ఉపాసన అభిప్రాయం వ్యక్తం చేశారు. నాతో పాటు నా బేబీ కూడా ఈ ఫీలింగ్స్ ను పొందుతున్నందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ క్షణాలు ఎమోషనల్ గా అనిపిస్తున్నాయని ఉపాసన అన్నారు. ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాసన వ్యక్తిగతంగా ఇటు కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు చరణ్ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శంకర్ మూవీతో చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీని మించిన సక్సెస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus