Tollywood: 2022 టాలీవుడ్ మూవీస్.. న్యూ రిలీజ్స్ డేట్స్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి పెద్ద సినిమాలు విడుదల తేదీలు మారిపోయాయి. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అసలు సినిమాలు ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాయి. ఇక మొన్నటివరకు సంక్రాంతి కానుకగా వస్తుంది అనుకున్న భీమ్లా నాయక్ సినిమా మరోసారి వాయిదా పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సంక్రాంతి పోటీలో లేదు అని నిర్మాతలు అఫీషియల్ గా వివరణ ఇచ్చేసారు.

ఇక ఫిబ్రవరి 25వ తేదీన భీమ్లా నాయక్ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలియజేశారు.

ముందుగా సంక్రాంతికి RRR సినిమా జనవరి 7వ తేదీన రాబోతున్న విషయం తెలిసిందే.

ఇక మరో వారం తర్వాత రాధేశ్యామ్ సినిమా జనవరి 14 వ తేదీన రాబోతోంది.ఈ పెద్ద సినిమాల కు పోటీగా ఉండకూడదు అని నిర్మాతలు చర్చలు జరిపి భీమ్లా నాయక్ సినిమా వాయిదా పడేలా చేశారు.

ఇక బంగార్రాజు సినిమా జనవరి 15వ తేదీ లేదా జనవరి 21వ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ ఆచార్య సినిమా పై కూడా ప్రస్తుతం చాలా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన రాబోతున్నట్లు చెబుతున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సంక్రాంతి నుంచి ఇదివరకే తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక యష్ KGF చాప్టర్ 2 ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే దిల్ రాజు నిర్మిస్తున్న F3 సినిమా ఫిబ్రవరిలో రావాల్సింది. ఇక ఈ సినిమాను కూడా ఏప్రిల్ లోనే విడుదల చేస్తున్నారు. F3 సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కాబోతుంది.

ఇక ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus