Mahesh Babu, Rajamouli: రాజమౌళి – మహేష్‌బాబు సినిమాపై లేటెస్ట్‌ టాక్!

మహేష్‌బాబు – రాజమౌళి సినిమా కథేంటి, విజయేంద్ర ప్రసాద్‌ ఎలాంటి కథ వెతుకుతున్నారు, ఈ సినిమాలో నాయిక ఎవరు అనే విషయాల గురించి మేమిక్కడ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా అనుకున్నట్లుగా ఈ ఏడాది మొదలవ్వదు అని వార్తలు రావడమే. ప్రస్తుత పరిస్థితులు, రాజమౌళి టీమ్‌లో కొందరి ప్రాజెక్టులు చూస్తుంటే ఈ ఏడాది సినిమా మహేష్‌ – జక్కన్న సినిమా స్టార్ట్‌ అయ్యే అవకాశమే లేదని సమాచారం. రాజమౌళి – మహేష్‌బాబు సినిమా కథ కొలంబియా అడవి నేపథ్యంలో ఉంటుందని తొలుత వార్తలొచ్చాయి.

ఆ తర్వాత బాండ్‌ స్టయిల్‌ సినిమా అన్నారు. ఆ తర్వాత పీరియాడికల్‌ సినిమా అన్నారు. ఇప్పుడు ఇంకా ఏవేవో పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య విజయేంద్ర ప్రసాద్‌ మహేష్‌ సినిమా కథ రాస్తున్నట్లు ఓ ఫొటో బయటకు వచ్చింది. అందులో ఆయన ముందు నోట్లు చిన్న గుట్టగా ఉన్నాయి. దీంతో డబ్బుల నేపథ్యంలో సినిమా అని కూడా అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే… అసలు ఈ ఏడాది సినిమా మొదలుపెడతారా అంటే డౌటనే చెబుతున్నాయి పరిస్థితులు.

రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ ఇటీవల మరో సినిమాను ఒప్పుకున్నారు. మామూలుగా ఆయన రాజమౌళి సినిమా ఇంత త్వరగా లేదు అంటేనే వేరే సినిమాలు చేస్తుంటారు. తాజాగా సెంథిల్‌ గాలి కిరీటి ఇంట్రడక్షన్‌ మూవీకి పని చేస్తున్నారు. దీంతో ఇంత త్వరగా రాజమౌళి – మహేష్‌ సినిమా లేదు అని చెప్పొచ్చు. మామూలుగా రాజమౌళి సినిమా విడుదలయ్యాక ఏడాది తర్వాతే కొత్త సినిమా స్టార్ట్‌ చేస్తారు. అలా మార్చి 25న వస్తోంది. ఆ లెక్కన వచ్చే జనవరి వరకు సినిమా స్టార్ట్‌ ఉండకపోవచ్చు అనేది మరో వాదన.

మరోవైపు మహేష్ బాబు కూడా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా మొదలుపెడతారు. ఆ సినిమా ఈ ఏడాది ఆఖరి వరకు మహేష్‌బాబు బిజీ అంటున్నారు. ఆ లెక్కన రాజమౌళి – మహేష్ బాబు సినిమా వచ్చే ఏడాదిలో స్టార్ట్‌ అవుతుంది. ఇక విడుదల అంటారా… రాజమౌళి సినిమా కదా రోజులు లెక్కేసుకోవడం కరెక్ట్‌ కాదు. వచ్చినప్పుడు చూసి ఎంజాయ్‌ చేయడమే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus