Nithiin: ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశాడా..?

టాలీవుడ్ హీరో నితిన్, దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్ లో ‘పవర్ పేట’ అనే సినిమా తెరకెక్కనున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఛల్ మోహన రంగ’ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ దర్శకుడిపై ఉన్న నమ్మకంతో మరో సినిమా చేయాలనుకున్నాడు నితిన్. కృష్ణ చైతన్య చెప్పిన పొలిటికల్ టచ్ ఉన్న ‘పవర్ పేట’ కథ నితిన్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను మూడు భాగాలుగా తీస్తారని అన్నారు.

ఆ తరువాత రెండు భాగాలుగా సెట్ చేశారని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ‘అంధాధూన్’ సినిమా రీమేక్ లో నటిస్తోన్న నితిన్.. తన తదుపరి చిత్రంగా ‘పవర్ పేట’ మొదలుపెడతారని అంతా అనుకున్నారు. మొన్నామధ్య నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. అయితే మొదటి భాగం హిట్ అయితేనే రెండో భాగం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ ను నితిన్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల వక్కంతం వంశీ చెప్పిన కథ నితిన్ కి నచ్చడంతో ముందుగా వంశీ సినిమా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడట. ‘నా పేరు సూర్య’ సినిమా తరువాత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా ఇది. మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఈసారి కథను మరింత పకడ్బందీగా రాసుకొని సినిమా మొదలుపెట్టబోతున్నాడు. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus