మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ (Uppena) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కృతి శెట్టి (Krithi Shetty) ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకి సంగీతం అందించారు. సుకుమార్ (Sukumar) శిష్యుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థల పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar).. ఈ సినిమాను నిర్మించగా సుకుమార్ సహా నిర్మాతగా వ్యవహరించారు.2021 ఫిబ్రవరి 12న ఈ సినిమా విడుదలైంది. హీరోయిన్ లుక్స్.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైప్ తీసుకొచ్చాయి.
క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి ‘ఉప్పెన’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 15.63 cr |
సీడెడ్ | 7.80 cr |
ఉత్తరాంధ్ర | 8.58 cr |
ఈస్ట్ | 5.08 cr |
వెస్ట్ | 2.63 cr |
గుంటూరు | 3.01 cr |
కృష్ణా | 3.21 cr |
నెల్లూరు | 1.78 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 47.72 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.38 cr |
ఓవర్సీస్ | 1.42 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 51.52 cr (షేర్) |
‘ఉప్పెన’ చిత్రం రూ. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా 51.52 కోట్ల షేర్ ను రాబట్టి… రూ.30.52 కోట్ల లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి చేరింది. మొత్తంగా రూ.85 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది ఈ సినిమా. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పుడు ఏకంగా రాంచరణ్ తో సినిమా చేయడానికి కూడా ఈ సినిమా సాధించిన సక్సెస్ కారణం అని చెప్పాలి.