మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఉప్పెన సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి నెల 12వ తేదీన విడుదలైంది. సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీ క్లైమాక్స్ కు సంబంధించి అనేక వార్తలు వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మాస్ ఫ్యాన్స్ తో పాటు క్లాస్ ఫ్యాన్స్ ను సైతం మెప్పించేలా ఉండటంతో ఉప్పెన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జనవరి 31 వరకు 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులో ఉండగా ఫిబ్రవరి నెల నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి రావడంతో ఉప్పెన సినిమాకు ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
కరోనా భయం వల్ల ప్రేక్షకులు మళ్లీ థియేటర్లలో సినిమాలు చూస్తారా..? అని దర్శకనిర్మాతల్లో నెలకొన్న అనుమానాలను ఉప్పెన సినిమా పటాపంచలు చేసింది. ఈ సినిమా హిట్ కావడంతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలకు కొత్త సినిమా ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమాతో డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా కొనుగోలు చేసింది.
ఈ నెల 18వ తేదీన ఉప్పెన స్మాల్ స్క్రీన్ పై ప్రసారం కాగా ఈ సినిమాకు టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా రాలేదని తెలుస్తోంది. సాధారణంగా థియేటర్లలో హిట్టైన సినిమాలు బుల్లితెరపై కూడా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ లను రాబడుతుంటాయి. ఉప్పెన విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరగడం గమనార్హం. ఉప్పెన బుల్లితెరపై ప్రసారం కావడానికి కొన్నిరోజుల ముందే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఆ రీజన్ వల్లే ఉప్పెన బుల్లితెరపై ఆకట్టుకోలేదని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఉప్పెన సినిమా బుల్లితెరపై నిరాశపరచడం గమనార్హం.