Urvashi Rautela: హీరో రామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని శ్రీ లీలా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం స్కంద ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాలోని కల్ట్ మామా అంటూ సాగిపోయే ఒక స్పెషల్ సాంగ్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పాటలో హీరో రామ్ సరసన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతెలా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఈమె పాల్గొని సందడి చేశారు అనంతరం ఈమె మాట్లాడుతూ రామ్ గురించి ఆయన డాన్స్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఊర్వశి మాట్లాడుతూ తాను గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో కూడా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇలా చిరంజీవి గారితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చేసే సమయంలో ఆయన ఒక మాట అన్నారు నువ్వు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇద్దరు సూపర్ డాన్సర్లతో నటిస్తున్నావని చెప్పారు. ఒకటి నేను మరొకరు రామ్ అంటూ చిరంజీవి చెప్పారు. నిజంగానే చిరంజీవి గారు చెప్పినట్టు రామ్ ఒక అద్భుతమైన డాన్సర్ అని ఈ సందర్భంగా  (Urvashi Rautela) ఈమె తెలియజేశారు.

ఎలాంటి క్లిష్టమైన మూవ్మెంట్ అయినా కూడా రామ్ సింగిల్ టేక్ లో పూర్తి చేస్తారు. అలాగే ఈయన ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గిపోవని ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటారు అంటూ ఈ సందర్భంగా రామ్ పోతినేని డాన్స్ గురించి ఊర్వశి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల నటించిన సంగతి మనకు తెలిసిందే.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus