నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) అందరికీ సుపరిచితమే. బాలీవుడ్లో పాపులర్ అయిన ఈ బ్యూటీ వరుసగా సౌత్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఇటీవల బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’ లో (Daaku Maharaaj) ఓ కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉండగా.. గత రెండు, మూడు రోజులుగా కొంతమంది నెటిజన్లు.. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ అభిమానుల ఈమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. మేటర్ ఏంటంటే.. ఇటీవల ఊర్వశి రౌతేలా మీడియాతో ముచ్చటించారు.
ఆ టైంలో తన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ కోసం మాట్లాడుతున్న టైంలో సైఫ్ అలీ ఖాన్ పై (Saif Ali Khan) జరిగిన దాడి గురించి కొందరు రిపోర్టర్లు ఆమెను స్పందించాలని కోరారు. కానీ ఆమె వాటిని పట్టించుకోకుండా… “నా తల్లి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చింది, తండ్రి ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడు’ అంటూ టాపిక్ ని డైవర్ట్ చేసి ‘డాకు మహారాజ్’ వంద కోట్ల వసూళ్ల గురించి మాట్లాడింది.
దీంతో సైఫ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు.వాళ్ళ ట్రోల్స్ కు తట్టుకోలేకపోయిన ఊర్వశి స్పందించి ఓ పోస్ట్ పెట్టింది. ఆమె ఆ పోస్ట్ ద్వారా స్పందిస్తూ ” నేను సైఫ్ అలీ ఖాన్ కు, అలాగే వాళ్ళ అభిమానులకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ దాడి వెనుక ఎంత సీరియస్ నెస్ ఉంది అనేది నాకు మొదట అర్థం కాలేదు.
దీంతో నాపై నాకే సిగ్గేస్తుంది. ఆ టైం ‘డాకు మహారాజ్’ సక్సెస్ వల్ల వచ్చిన గిఫ్ట్ ల గురించి నేను మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. దయచేసి నన్ను క్షమించండి. నేను చాలా మూర్ఖంగా వ్యవహరించారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను” అంటూ పేర్కొంది ఊర్వశి రౌతేలా.