Urvashi Rautela: మాస్ హీరోలతో ఊర్వశి రౌతేలా స్టెప్పులు!

బాలీవుడ్ లో హీరోయిన్ కొన్ని సినిమాలు చేసింది ఊర్వశి రౌతేలా. ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇంతలో ఆమెకి పలు ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రామ్-బోయపాటి సినిమాలో ఊర్వశిని స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాబీ ‘వాల్తేర్ వీరయ్య’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఊర్వశిని ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘వాల్తేర్ వీరయ్య’ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాల్సివుంది. అందుకే హైదరాబాద్ లో ఉన్న ఊర్వశితో పాటను ఫినిష్ చేసేశారు. దీనికోసం మరో ఆప్షన్ కూడా ఆలోచించలేదు. ఈ సాంగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఓపెన్ సెట్ వేశారు. ఈ ఒక్క పాట కోసం ఏకంగా డజను క్రేన్ లను తెప్పించినట్లు తెలుస్తోంది. అప్పటికప్పుడు డజను క్రేన్స్ ను వాడి పాటను పిక్చరైజ్ చేసినట్లు తెలుస్తోంది.

దేవిశ్రీప్రసాద్ మాస్ ట్యూన్ తో ఈ పాట ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ఈ సాంగ్ లో ఊర్వశి.. మెగాస్టార్ చిరంజీవి, రవితేజలతో కలిసి ఆడిపాడింది. ఈ మాస్ సాంగ్ కి థియేటర్లో విజిల్స్ పడడం ఖాయమని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించనున్నారు.

ఏపీ, తెలంగాణ ఏరియాల నేపథ్యంలో కథ నడుస్తుందట. ఇందులో చిరు గోదావరి యాస మాట్లాడుతూ కనిపిస్తారట. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus