‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి అల్లు శిరీష్ నవంబర్ 4న ‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కళ్యాణ్ దేవ్ తో ‘విజేత’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్, ట్రైలర్ లకు మంచి మార్కులే పడ్డాయి.మొదటి రోజు ఈ మూవీ పర్వాలేదు అనిపించే విధంగా టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఓపెనింగ్స్ విషయంలో జస్ట్ ఓకే అనిపించింది అంతే.!5 వ రోజు ఈ సినిమా అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇలా అయితే బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమనే చెప్పాలి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.75 cr
సీడెడ్
0.37 cr
ఉత్తరాంధ్ర
0.27 cr
ఈస్ట్
0.19 cr
వెస్ట్
0.11 cr
గుంటూరు
0.13 cr
కృష్ణా
0.15 cr
నెల్లూరు
0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.38 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
2.43 cr (షేర్)
‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.6.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.2.43 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.4.07 కోట్లు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ ఇంకా చాలా ఉంది.
పైగా ‘కాంతార’ దూకుడు ముందు ‘ఊర్వశివో రాక్షశివో’ నిలబడలేకపోతుంది. రానున్న రోజుల్లో స్టడీగా రాణిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు అనే చెప్పాలి.