‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి అల్లు శిరీష్.. ఈ ఏడాది ‘ఊర్వసివో రాక్షశివో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కళ్యాణ్ దేవ్ తో ‘విజేత’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.శిరీష్ కు జోడీగా అను ఇమాన్యుల్ నటించింది.వెన్నెల కిషోర్, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ అయ్యింది.
మొదటి రోజు ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం గట్టెక్కలేకపోయింది. అన్ సీజన్ కావడంతో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ‘శ్రీ తిరుమల ప్రొడక్షన్’ ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం లు కలిసి నిర్మించారు. ఇక థియేటర్లలో పెద్దగా కలెక్ట్ చేయలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం..
డిసెంబర్ 9 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం డిజిటల్ హక్కులను ఆహా వారు రూ.4.5 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను అందించినట్లు సమాచారం. ఈ మూవీలో శిరీష్- అను ల మధ్య రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సన్నివేశాలు ఓ రేంజ్లో పండాయి.
దీంతో యువత ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్లలో ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.