Urvasivo Rakshasivo Teaser: బోల్డ్ గా ఉన్నా.. ఎంటర్టైన్ చేసే విధంగా ఉంది..!

Ad not loaded.

3 ఏళ్ళ గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ హీరోగా రూపొందిన మూవీ ‘ఊర్వశివో రాక్షసివో’. ‘భలే భలే మగాడివోయ్’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతిరోజు పండగే’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి హిట్స్ అందించిన GA2 పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రం రూపొందుతుంది.’విజేత’ వంటి మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అను ఇమ్మాన్యూల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కోవిడ్ కారణంగా రిలీజ్ ఆలస్యమైన సినిమాల్లో ఇది కూడా ఒకటి.

తాజాగా ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. పక్కా యూత్ ఫుల్ కంటెంట్ తో ఈ చిత్రం రూపొందినట్లు టీజర్ హింట్ ఇచ్చింది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ ఈ టీజర్ కు హైలెట్ అని చెప్పాలి.లిప్ లాక్ సన్నివేశాలు, ఇంటిమేట్ సన్నివేశాలు ఈ మూవీలో ఓ రేంజ్లో ఉంటాయనడానికి టీజర్ సాంపుల్ అని చెప్పవచ్చు.టీజర్ లోని కొన్ని డైలాగ్స్ కూడా బాగా ఆకర్షిస్తాయి.

అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఈ చిత్రం ద్వారా కొత్తగా చెప్పబోతున్నట్టు తెలుస్తుంది.ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండే ఈ చిత్రం యూత్ ను అట్రాక్ట్ చేసింది. ఇక టీజర్ తో అంచనాలను పెంచిందనే చెప్పొచ్చు. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించగా విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహరించారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. నవంబర్ 4న ఈ మూవీ విడుదల కాబోతుంది. టీజర్ యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!


అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus