ఆకట్టుకుంటున్న ఉయ్యాలవాడ ప్రీ లుక్
- March 22, 2017 / 07:38 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత చేయనున్న మూవీ ఖరారైన సంగతి తెలిసిందే. 151 చిత్రంలో చిరు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి గా కనిపించనున్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం నరసింహా రెడ్డి గా చిరు ఏ గెటప్ లో కనిపిస్తే బాగుంటుందోనని చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ ఆర్టిస్టులు స్కెచ్ లు గీస్తున్నారు.
వాటిలోంచి ఒక స్కెచ్ లీక్ అయింది. ఉయ్యాలవాడగా చిరంజీవి ప్రీ లుక్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లుక్ మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. లైక్లు అందుకుంటోంది. సో ఫ్యాన్స్ మెచ్చిన చిత్రాన్ని చిత్ర బృందం ఫైనల్ చేస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















