Vaishnav, Varun: ఆ విషయంలో వైష్ణవ్ వరుణ్ ను ఫాలో అవుతున్నారా?

మెగా ఇంట్లో ఎంతోమంది బ్యాచిలర్ హీరోలు ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ వరుణ్ తేజ్ కూడా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే త్వరలోనే మరొక హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈయన పెళ్లి కావడంతో సాయి ధరంతేజ్ కి కూడా పెళ్లి ఒత్తిడి కలుగుతుంది అంటూ పరోక్షంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరగడంతో వీరి పెళ్లికి ముందే చిరంజీవితో పాటు అల్లు అర్జున్ కూడా పార్టీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పార్టీలో నటి రీతు వర్మ హాజరు కావడంతో పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ పార్టీలో హాజరు అయ్యారంటూ త్వరలోనే ఈమె కూడా మెగా ఇంటి కోడలు కాబోతుందా అనే సందేహాలు వచ్చాయి.

వైష్ణవ్ తేజ్ (Vaishnav) రీతు వర్మ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అందుకే ఈమె కూడా ఈ పార్టీలో భాగమయ్యారు అంటూ వార్తలు రాగా తాజాగా వైష్ణవ్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఆదికేశవశ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వైష్ణవ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు నిజా నిజాలు మాట్లాడకుండా వార్తలు రాయడం సరికాదని ఈయన తెలియజేశారు.

రీతు వర్మ తన గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఆమె లావణ్య త్రిపాటికి చాలా మంచి స్నేహితురాలు కావడంతో ఈ పార్టీకి హాజరయ్యారు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై వైష్ణవ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు గతంలో కూడా కృతి శెట్టితో ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus