మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ ‘జాని’ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. అయితే గత ఏడాది వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. డెబ్యూ హీరోల సినిమాల్లో ఇదే నెంబర్ 1 గ్రాసర్ గా నిలిచింది. కానీ ‘ఉప్పెన’ మేజర్ క్రెడిట్ అంతా హీరోయిన్ కృతి శెట్టి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అకౌంట్లో పడిపోయింది.
‘ఉప్పెన’ రిలీజ్ అవ్వడానికి ముందే క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే చిత్రాన్ని చేశాడు వైష్ణవ్ తేజ్. ఈ మూవీ నిజానికి ఓటీటీ కోసమని తీశారు. అయినప్పటికీ ‘ఉప్పెన’ చిత్రం సక్సెస్ పుణ్యమా అని ‘కొండపొలం’ నిర్మాతలకు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మంచి లాభాలు దక్కాయి. అయితే వెంటనే ‘రంగ రంగ వైభవంగా’ అనే చిత్రానికి కూడా వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.
అయితే హీరో వైష్ణవ్ తేజ్ నటనకు మాత్రం అస్సలు పేరు పెట్టనవసరం లేదు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. చాలా చోట్ల తన అన్న కంటే కూడా సూపర్ టాలెంటెడ్ అనిపించాడు. ఇంకా చెప్పాలి అంటే మెగా హీరోలు డెబ్యూ మూవీల్లో తమ లుక్స్ తో అంతగా ఆకర్షించలేదు. కానీ వైష్ణవ్ మాత్రం మొదటి సినిమాతోనే జనాలను ఆకర్షించాడు. కాకపోతే కథల ఎంపిక విషయంలో ఇతను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
‘ఉప్పెన’ హీరో అనే ముద్ర ఇతని పై ఉంది. ఆ ముద్ర తొలిగిపోవాలి. యాక్షన్ కథలకు కూడా వైష్ణవ్ కరెక్ట్ గా సరిపోతాడు. ఒక పెద్ద డైరెక్టర్ చేతిలో పడితే సెట్ అయిపోతాడు.సాయి ధరమ్ తేజ్ మొదటి 3 సినిమాలకు పెద్ద డైరెక్టర్లతో పని చేసే అవకాశం దక్కింది. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్లతో పాటు దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి బడా నిర్మాతలు అతన్ని బాగా పుష్ చేశారు. వైష్ణవ్ విషయంలో కూడా అలాంటి పెద్ద వాళ్ళు పుష్ చేస్తే ఇతను తక్కువ టైంలోనే స్టార్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర