Vaishnav Tej: హిట్ సినిమా మిస్ చేసుకున్న వైష్ణవ్!

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తరువాత టాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. తొలివారం పూర్తయ్యేసరికి మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది. నాగచైతన్య కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా ఇది. నిజానికి ఈ కథ చైతు దగ్గరకి రావడానికి ముందు చాలా చోట్ల తిరిగింది. ముందుగా ఈ కథను కొత్తవాళ్లతో చేయాలనుకున్నారు శేఖర్ కమ్ముల. దానికి తగ్గట్లుగానే అందరూ కొత్తవాళ్లతో సినిమా మొదలుపెట్టారు.

కొంత షూటింగ్ పూర్తయిన తరువాత రషెస్ చూసుకుంటే ఆయనకు సంతృప్తిగా అనిపించలేదు. దీంతో తెలిసిన ముఖాలతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో కొంతమంది హీరోలను కలిసి కథ వినిపించారు. మెగాహీరో వైష్ణవ్ తేజ్ దగ్గరకు ‘లవ్ స్టోరీ’ కథ వెళ్లిందట. శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ తో కలిసి పని చేసే ఛాన్స్ వస్తే ఎవరు కాదంటారు. దీంతో వైష్ణవ్ కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ తరువాత తన ఆలోచన మార్చుకున్నాడు.

వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమా కులాంతర ప్రేమ కథ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. వరుసగా రెండో సినిమా కూడా అదే కాన్సెప్ట్ అంటే కరెక్ట్ కాదని ఫీల్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. ఇదే విషయాన్ని శేఖర్ కమ్ములకి చెప్పి ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. అప్పుడు ఫైనల్ గా నాగచైతన్య దగ్గరకు ఈ కథ వెళ్లింది. కథ విన్న చైతు వెంటనే ఒప్పేసుకున్నాడట. నాగార్జునకు కూడా కథ నచ్చడంతో వెంటనే షూటింగ్ మొదలుపెట్టేశారు. అలా ఈ భారీ హిట్ సినిమాను వదులుకున్నాడు మెగాహీరో.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus