Vaishnavi Chaitanya: ఆ రెండు సినిమాలు వైష్ణవి చైతన్య కెరీర్ ను మార్చనున్నాయా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో వైష్ణవి చైతన్య స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. వైష్ణవి చైతన్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. వైష్ణవి చైతన్య పారితోషికం కోటి రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. తాజాగా వైష్ణవి చైతన్య రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్ లు కావడం గమనార్హం.

సిద్ధు జొన్నలగడ్డ, అశిష్ లకు జోడీగా వేర్వేరు ప్రాజెక్ట్ లలో వైష్ణవి నటించనున్నారని తెలుస్తోంది. తెలుగమ్మాయి అయిన వైష్ణవి చైతన్య తన టాలెంట్ తో వరుసగా మూవీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ కాంబో మూవీలో వైష్ణవి హీరోయిన్ గా ఎంపిక కాగా బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుతోంది.

అశిష్ అరుణ్ భీమవరపు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు కూడా వైష్ణవి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే వైష్ణవి చైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయే అవకాశం ఉంది. వైష్ణవి చైతన్య కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కథల ఎంపిక విషయంలో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)  జాగ్రత్త వహించాల్సి ఉంది. వైష్ణవి చైతన్యకు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. బేబీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బేబీ2 మూవీ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. వైష్ణవి చైతన్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus