Vaishnavi Chaitanya: నా జర్నీ ప్రారంభమైంది అక్కడే… వైష్ణవి చైతన్య వీడియో వైరల్!

వైష్ణవి చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈమె పేరే మారుమోగిపోతుంది. యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. పలు సినిమాలలో సిస్టర్ పాత్రలో నటించిన వైష్ణవి చైతన్య అనంతరం బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా మారిపోయారు. ఇక ఈమె నటించిన బేబీ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. అయితే తనకు ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చిన తన మూలాలను మాత్రం మర్చిపోను అంటూ తాజాగా ఈమె షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య సోషల్ మీడియా వేదికగా తాను మొదట పని చేసిన ఇన్ఫినిటం సమస్థ కొత్త బ్యానర్ ఏర్పాటు చేసిన సందర్భంలో ఈమె అభినందనలు తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా (Vaishnavi Chaitanya) వైష్ణవి చైతన్య ఏం తెలియజేశారనే విషయానికి వస్తే.. నా జీవితంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి అందులో ఒకటే ఇన్ఫినిటం. నా జర్నీ మొదలైంది ఇక్కడే. అక్కడ పనిచేసేటప్పుడు అందరూ కూడా నన్ను నువ్వు ఎప్పటికైనా స్టార్ అవుతావని అనేవాళ్ళు అయితేనన్ను ఇలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియజేశారు.

నేను ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా ఎప్పటికీ తన మూలాలను మర్చిపోలేనని, నా ఈ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపారు. మంచి చెడులను గుర్తించుకుంటానని నన్ను ఇంతగా బేబీ సినిమాలో ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య షేర్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus