Mohan Babu: మోహన్ బాబు పై ఊహించని కామెంట్లు చేసిన ‘వకీల్ సాబ్’ బ్యూటీ

‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ‘బేబీ’ (Baby) వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది లిరీష (Lirisha). ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ లో పవన్ కళ్యాణ్ ఈమెను ‘సూపర్ ఉమెన్’ అంటూ ర్యాగింగ్ చేసే సీన్ తో బాగా వైరల్ అయ్యింది. ఆ ఒక్క డైలాగ్ తోనే ఈమె బాగా పాపులర్ అయిపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈమె పాల్గొని మోహన్ బాబు (Mohan Babu) గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

లిరీష మాట్లాడుతూ.. “గతంలో నేను అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో అలీ (Ali) గారి సాయంతో ‘పొలిటికల్ రౌడీ’ (Political Rowdy) సినిమాలో ఛాన్స్ లభించింది. అందులో ఛార్మీ (Charmy) స్నేహితురాలి పాత్ర. అందులో నా లుక్ చూస్తే చాలా కామెడీగా ఉంటుంది. ఇక ఓ సీన్ షూట్లో భాగంగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) గారు నన్ను తోస్తే కిందకి పడాలి. సీన్ షూటింగ్ జరుగుతుంది. ప్రకాష్ రాజ్ నన్ను తోసినా నేను కిందకి పడటం లేదు.

అప్పుడు మోహన్ బాబు వెనుక నుండి వచ్చి నన్ను తోసేశారు. నేను కింద పడ్డాను. షూట్ ఓకే అయ్యింది. కానీ నేను కింద పడిపోవడంతో రాళ్ళు తగిలి నా చేతులు కొట్టుకున్నాయి. అప్పుడు మోహన్ బాబు గారు ఆయింట్మెంట్ వంటివి తెచ్చి నాకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. అలాగే సీన్ ఎలా చెయ్యాలో వివరించారు.

ఆయనకి సెట్ కి లేట్ వచ్చేవాళ్ళు అంటే నచ్చదు. పిలిచి మరీ క్లాస్ పీకుతూ ఉంటారు. అందుకే నేను ఉదయం 5 :30 నిమిషాలకు సెట్ కి వెళ్లిపోయేదాన్ని. పైకి కోపంగా కనిపిస్తారు కానీ మోహన్ బాబు చాలా మంచి వ్యక్తి. ఆయన వద్ద నుండి నటన, డిసిప్లిన్ వంటివి బాగా నేర్చుకోవచ్చు” అంటూ చెప్పుకొచ్చింది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus