‘వకీల్ సాబ్’ సినిమాకి బ్లాక్ బస్టర్ రివ్యూ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇంతలోనే ఈ సినిమా ఓ రేంజ్ లో ఉందంటూ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ లో సెన్సార్ బోర్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు.. సినిమా విడుదలకు ముందే తాను సినిమాలు చూస్తానని.. వాటికి రివ్యూలు చెబుతూ సోషల్ మీడియాలో కాస్త పాపులారిటీ తెచ్చుకున్నాడు.

తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమాకి సంబంధించిన రివ్యూ ఇచ్చాడు ఉమైర్ సంధు. సెన్సార్ రిపోర్ట్ సాలిడ్ అండ్ టెరిఫిక్ గా ఉందని.. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుందని.. అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఈ సినిమాతో పవన్ బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నారంటూ రివ్యూ ఇచ్చేశారు. అయితే గతంలో ఉమైర్ సంధు ‘అజ్ఞాతవాసి’, ‘స్పైడర్’ లాంటి సినిమాలకు కూడా ఇలానే బ్లాక్ బస్టర్ అంటూ రివ్యూలు ఇచ్చాడు.

రిలీజ్ తరువాత ఆ సినిమాలకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మనకి తెలిసిందే. దీంతో ఉమైర్ సంధు రివ్యూలపై విశ్వసనీయత సన్నగిల్లింది. కానీ ‘వకీల్ సాబ్’ స్టోరీ ఆల్రెడీ నిరూపించుకున్న కథ కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాకి కచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus