Vakeel Saab Movie: లేట్‌గా వచ్చినా సూపర్‌ ర్యాంక్‌ కొట్టేశాడు

  • June 8, 2021 / 02:33 PM IST

రీమేక్‌గా వచ్చి తొలి సినిమాను మించేలా చేయడం అంటే కష్టమే అని చెప్పాలి. ఇటీవల కాలంలో అలా రీమేక్‌గా వచ్చి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురింపించిన సినిమా ‘వకీల్‌సాబ్‌’. బాలీవుడ్‌లో బెస్ట్‌ మూవీగా పేరు తెచ్చుకున్న అమితాబ్‌ బచ్చన్‌ ‘పింక్’ను తెలుగులో ‘వకీల్‌సాబ్‌’గా తీసుకొచ్చారు. మధ్యలో తమిళంలో ‘నేర్కొండ పార్వై’గా కూడా వచ్చింది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ ముందు వచ్చిన ఈ పవన్‌ కల్యాణ్‌ సెకండ్‌ ఇన్నింగ్ మూవీ ‘పింక్‌’కి బెస్ట్‌ కమర్షియల్‌ వెర్షన్‌ అని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాల గురించి నిపుణుల మాటలు అని చెప్పాలంటే… రోటన్‌ టమోటాస్‌, ఐఎండీబీ అని చెప్పొచ్చు. ఈ రెండు సూచీల్లో పై మూడు సినిమాలు ఎక్కడ ఉన్నాయా అనేది ఓసారి చూద్దాం. ఒకదాంట్లో మన లాయర్‌ నెం.1లో ఉంటే, మరో సూచీలో బాలీవుడ్‌ లాయర్‌ తొలి స్థానంలో నిలిచారు. ముందుగా రోటన్‌ టమోటాస్‌లో చూస్తే ‘వకీల్‌సాబ్‌’కు 88 శాతం స్కోరు వచ్చింది. అదే ‘నేర్కొండ పార్వై’కి 86 శాతం వచ్చింది. ఇక అసలు కథ ‘పింక్‌’కు 76 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో ఈ సూచీలో మన లాయర్ నెం.1.

ఇక రెండో సూచీ ఐఎండీబీ చూస్తే… మాతృక సినిమానే బెస్ట్‌గా నిలిచింది. 8.1 రేటింగ్‌తో ‘పింక్‌’ తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మన లాయర్‌ ఉన్నాడు. ‘వకీల్‌సాబ్‌’కు 7.9 రేటింగ్‌ వచ్చింది. అజిత్‌ ‘నేర్కొండపార్వై’కి 7.8 రేటింగ్‌ వచ్చింది. అలా అజిత్‌ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రేటింగ్‌ ఏ సినిమా గొప్ప అని చెప్పలేం. ఎందుకంటే ఎవరి వెర్షన్‌ వాళ్లు వావ్‌ అనిపించారు కూడా.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus