పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో హిందీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ మూవీపై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ నెల 3వ తేదీన యూసఫ్ గూడలో జరగనుంది. పవన్ రీఎంట్రీ సినిమా కావడంతో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ కోసం భారీ మొత్తం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దిల్ రాజు ఇప్పటికే ఉన్న టీమ్ తో పాటు కొత్త టీమ్ ను కూడా నియమించుకున్నారని.. ప్రతి జిల్లాలోని ప్రధాన నగరంలో ఒకటి చొప్పున లైటింగ్ బెలూన్లను ఏర్పాటు చేసేలా దిల్ రాజు ప్లాన్ చేశారని సమాచారం. ఒక బెలూన్ ఖరీదు 30,000 రూపాయలు అని ప్రీ రిలీజ్ ఈవెంట్ కొరకు దిల్ రాజు ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. విడుదలకు 5 రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండటం గమనార్హం.
ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి కొన్ని పాటలు విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగెళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు స్టార్ హీరో ఒకరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానున్నారని సమాచారం.
మరోవైపు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వకీల్ సాబ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ కు పిలుస్తారా..? లేదా..? అనే విషయం తేలాల్సి ఉంది. వకీల్ సాబ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ విషయంలో స్పష్టత రావాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!