కోలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ కూడా ఉన్నారు.రజినీ కాంత్, విజయ్ ల తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఉన్నది అజిత్ కే అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో మాత్రం ఈయనకి పెద్ద మార్కెట్ లేదు. ఇప్పుడిప్పుడే కొంత ఏర్పడుతుంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వలీమై’ నిన్న రిలీజ్ అయ్యి చాలా వరకు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అదిరిపోయే బైక్ రేస్ లు, యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ మూవీ ఓ విజువల్ ఫీస్ట్ అనిపించే ఫీలింగ్ ను కలిగించింది.
దాంతో తెలుగులో కూడా ‘వలీమై’ కి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఒకసారి ఫస్ట్ డె కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.18 cr
సీడెడ్
0.08 cr
ఉత్తరాంధ్ర
0.09 cr
ఈస్ట్
0.07 cr
వెస్ట్
0.06 cr
గుంటూరు
0.08 cr
కృష్ణా
0.06 cr
నెల్లూరు
0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.67 cr
‘వలీమై’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.0.67 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.83 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు బాగానే రాణించింది.అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ వారం మొత్తం అలానే రాబట్టాలి.
ఈరోజు నుండీ ‘భీమ్లా నాయక్’ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. దీని పోటీని తట్టుకుని నిలబడడం అంటే కాస్త పెద్ద విషయమే. మరి ‘వలీమై’ ఎంత వరకు హోల్డ్ చేసి రాబడుతుందో చూడాలి..!