Valimai Collections: ఓకే అనిపించిన ‘వలీమై’ కానీ టార్గెట్ ఇంకా ఉంది..!

అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ విలన్ పాత్రలో తెరకెక్కిన తాజా తమిళ చిత్రం ‘వలీమై’. అదే పేరుతో తెలుగులోకి కూడా డబ్ అయ్యింది. ఫిబ్రవరి 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది.అదిరిపోయే బైక్ రేస్ లు, యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకులకి ఓ విజువల్ ఫీస్ట్ ఫీలింగ్ ను కలిగించింది ఈ చిత్రం. దాంతో ‘వలీమై’ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ లభించాయి.

అయితే తర్వాతి రోజున ‘భీమ్లా’ ఎంటర్ అవ్వడం ఈ చిత్రం ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడింది.థియేటర్లు కూడా ఎక్కువగా ఈ మూవీకి మిగల్లేదు. అయినప్పటికీ ఉన్నంతలో ఓకె అనిపించింది.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 0.56 cr
సీడెడ్ 0.29 cr
ఉత్తరాంధ్ర 0.29 cr
ఈస్ట్ 0.22 cr
వెస్ట్ 0.17 cr
గుంటూరు 0.23 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.10 cr

‘వలీమై’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.1 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.0.40 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు బాగానే రాణించిన ఈ చిత్రానికి ‘భీమ్లా’ గట్టి దెబ్బ కొట్టిందని చెప్పాలి.అయినప్పటికీ మొదటి వారం ఓకె అనిపించింది. ఈ వీకెండ్ కనుక మూవీ నిలబడి ఇదే విధంగా పెర్ఫార్మ్ చేస్తే ‘వలీమై’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus