భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు మార్చి నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. దాదాపుగా 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకుంటామని భావిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే అవకాశం ఉండటంతో ఐపీఎల్ మ్యాచ్ ల ప్రభావం ఈ సినిమాపై పడే ఛాన్స్ అయితే ఉందని బోగట్టా. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజైన రోజునే ఓటీటీలో వలిమై రిలీజ్ కానుందని తెలుస్తోంది. వలిమై సినిమాకు యావరేజ్ టాక్ రాగా తమిళంలో మాత్రం ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వాళ్లకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందని చెప్పవచ్చు.
భారీ మొత్తానికి వలిమై డిజిటల్ హక్కులు అమ్ముడయ్యాయని జీ5 యాప్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజైన రోజునే వలిమై ఓటీటీలో రిలీజ్ కానుండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపై కొంతమేర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజైన వారం తర్వాత ఏప్రిల్ 1వ తేదీన తమ సినిమాలను రిలీజ్ చేయాలని కొంతమంది మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. గని, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలలో ఏదో ఒక సినిమా ఏప్రిల్ 1వ తేదీన రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నార్త్ ఇండియాలో కూడా ఆర్ఆర్ఆర్ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.