ఊర మాస్ గెటప్ లో రచ్చ చేస్తున్న వరుణ్ తేజ్

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “వాల్మీకి”. వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ-టీజర్ (ట్రైలర్ కి ముందు టీజర్ లా, టీజర్ కి ముందు గ్లింప్స్ ని ప్రీ-టీజర్ అంటారు) విడుదల చేశారు. ఊర మాస్ గెటప్ లో వరుణ్ తేజ్ ఎలా కనిపిస్తాడనేది ఈ ప్రీ-టీజర్ లో చూపించారు.

ఆల్రెడీ వరుణ్ బియర్డ్ లుక్ తో బయట చాలాసార్లు కనిపించేశాడు కాబట్టి.. ఆ కంటి పక్కన గాటు తప్పితే పెద్దగా ఎగ్జైట్ చేసిందేమీ లేదు. ఈ ప్రీ-టీజర్ కంటే పోస్టర్స్ రిలీజ్ చేసినా బాగుండు అనిపించినప్పటికీ.. వరుణ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అని ఒక చిన్న ఐడియా వచ్చింది జనాలకి. ఈ ఊరమాస్ లుక్ లో సీరియస్ నెస్ కంటే కామెడీ యాంగిల్ ఎక్కువగా కనిపించింది. తమిళ సూపర్ హిట్ చిత్రం “జిగర్తాండ” రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కి ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుంది అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus