2020 లో టాలీవుడ్ లో అప్పుడే రెండు అద్భుతాలు మొదలయ్యాయి. ఒకటి పవర్ స్టార్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం. ఇక రెండోది వంశీ పైడిపల్లి, మహేష్ లు కలిసి సినిమాలు చేస్తారు అనుకుంటే.. అది క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు వీరిద్దరూ మెగాస్టార్ తో సినిమాలు చేయబోతుండడం. అవును చిరు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాలో యంగ్ చిరంజీవి పాత్రను రాంచరణ్ చెయ్యాల్సి ఉంది. ఒకవేళ రాంచరణ్ చేస్తే ఆ చిత్రాన్ని 2021 సమ్మర్లో విడుదల చేసుకోమని ‘ఆర్.ఆర్.ఆర్’ దర్శకుడు రాజమౌళి గట్టిగా చెప్పాడట. దీంతో ఎలాగైనా ఈఏడాది సినిమాని చెయ్యాలని రాంచరణ్ పాత్రని మహేష్ తో చేయించాలని చిరు, కొరటాల డిసైడ్ అయినట్టు వార్తలొచ్చాయి. ఇక దీనికి మహేష్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడట. 45 నిమిషాల ఈ పాత్రకోసం మహేష్ 25 రోజులు కాల్ షీట్లు ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ మహేష్ తప్పుకుంటే ఈ పాత్రని సాయి తేజ్ తో చేయించే అవకాశాలు కూడా ఉన్నాయట.
ఇక మహేష్ తో సినిమా చెయ్యాలి అనుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి.. తాను రెడీ చేసుకున్న స్క్రిప్ట్ మహేష్ కు నచ్చకపోవడంతో బాగా హర్ట్ అయ్యాడట. ఈక్రమంలో మెగాస్టార్ ‘లూసిఫర్’ రీమేక్ చేసే ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో మొదట సుకుమార్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆయన స్క్రిప్ట్ మాత్రమే రెడీ చేసాడట. డైరెక్షన్ బాధ్యతల్ని వంశీ పైడిపల్లికి అప్పగించారట చిరు, చరణ్ లు. గతంలో ‘ఊపిరి’ అనే రీమేక్ ను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు వంశీ పైడిపల్లి. ఏదైతేనేం మహేష్,వంశీ కలిసి సినిమా చేస్తారు అనుకుంటే.. ఇద్దరూ విడివిడిగా చిరుతో సినిమాలు చేస్తున్నారు.