Star Actress: మంచి కథ ఉంటే హీరో ఎవరైనా ఓకే…స్టార్ నటి!

సినిమా పరిశ్రమలోకి ఒక్కరూ అడుగుపెట్టితే చాలు..వారి కుటుంబానికి మొత్తానికి ఇండస్ట్రీలోకి సులువైన బాట వేసినట్లే.. అలనాటి హీరోయిన్లు, నటులు, వాళ్ల పిల్లలను ఇండస్ట్రీలో హీరోగా, హీరోయిన్ గా పరిచయం చేయాలని అనుకుంటారు..పరిచయం అయితే ఈజీవేగానీ.. రానించడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది..ఇప్పుడు మరో నటి తన కుతురును హీరోయిన్ గా పరిచయం చేయాలని చూస్తోంది..ఆమె ఎవరో తెలుసుకుందాం.. తమిళ చిత్రపరిశ్రమలో వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన వనితా విజయకుమార్‌ తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరిని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

విజయ్‌ నటించిన ‘చంద్రలేఖ’ చిత్రంతో అరంగేట్రం చేసిన (Star Actress) వనితా విజయ్ కుమార్.. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించింది. ఆమె పెళ్లిళ్ల విషయంలోనూ ఈ మధ్య బాగా వైరల్ అయింది. రీసెంట్‌గా వచ్చిన సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ నటించిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలోనూ వివాదాస్పద పాత్రనే పోషించి.. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కొన్నాళ్లుగా ఆమె పరిస్థితి కోలీవుడ్‌లో అయితే ఏం బాగాలేదనే చెప్పుకోవాలి.

అందుకేనేమో.. ఇప్పుడామె కుమార్తెను రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉంది. తన కుమార్తె సినీ ఎంట్రీకి సంబంధించి తాజాగా ఆమె చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వనితా విజయ్ కుమార్ ఏం చెప్పిందంటే.. నా కుమార్తె జోవిక ను సినిమాల్లో పరిచయం చేసేందుకు ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను. ఏ హీరో సరసన పరిచయం చేశామన్నది ముఖ్యం కాదు. ఒక మంచి పాత్ర ద్వారా పరిచయం చేయాలన్నదే నా ఉద్దేశ్యం.

జోవిక సినీ రంగ ప్రవేశం గురించి త్వరలోనే ఒక మంచి వార్త వెలువడుతుంది. బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పదుకొణె, ప్రీతి జింటా, హృతిక్‌ రోషన్‌ వంటి వారు నటనలో శిక్షణ తీసుకున్న ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనే జోవిక కూడా శిక్షణ తీసుకుంది’ అని తెలిపారు. కాగా విజయ్‌ నటించిన ‘చంద్రలేఖ’ మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన వనిత ఇపుడు తన కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు కృషి చేస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus