Vanitha Vijaykumar: అలా అవమానించారని వనిత ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

తమిళ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే వనిత నా కూతురి పెళ్లికి నన్ను పిలవలేదంటూ ఎమోషనల్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఫ్యామిలీకి దూరంగా జీవనం సాగిస్తున్న వనిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. విజయ్ కుమార్ పెద్ద కూతురు అనిత కూతురు దియా పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరగగా ఈ వేడుకలకు వనితా విజయ్ కుమార్ కు ఆహ్వానం అందలేదని సమాచారం అందుతోంది.

తనను పెళ్లికి పిలవకపోవడం గురించి ఆమె ఫైర్ అయ్యారు. సాధారణంగా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా పెళ్లి లాంటి సందర్భాల్లో పిలవడం జరుగుతుంది. అయితే వనిత బిహేవియర్ వల్ల ఆమెకు పెళ్లికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు నామమాత్రంగా అయినా వనితా విజయ్ కుమార్ ను పెళ్లికి ఆహ్వానిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

వనితా విజయ్ కుమార్ ఎమోషనల్ కావడంలో తప్పు లేదని ఫ్యాన్స్ సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వనితా విజయ్ కుమార్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని ప్రస్తుతం పలు క్రేజీ ఆఫర్లతో ఆమె బిజీగా ఉన్నారని భోగట్టా. తాను కుటుంబం నుంచి వేరైనా తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం దెబ్బ తీయలేరని వనితా విజయ్ కుమార్ పేర్కొన్నారు.

వనితా విజయ్ కుమార్ (Vanitha Vijaykumar) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆమెకు మరిన్ని విజయాలు దక్కడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వనితా విజయ్ కుమార్ మంచి రోల్స్ ను ఎంచుకుంటే ఆమె కెరీర్ కు మరింత బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus